తెలంగాణ కోసం మరో ఎమ్మెల్యే రాజీనామా

Telangana
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరో ప్రజాప్రతినిధి రాజీనామా చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు సత్యనారాయణ మంగళవారం తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తెలంగాణలోని ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారన్నారు. తన నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక నుండి ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పారు. తెలంగాణ కోసం తాను కట్టుబడి ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమించడాన్ని తన నియోజకవర్గ ప్రజలు తప్పు పట్టారని అందుకే తాను వారితో కలిసి ఉద్యమించేందుకు వీలుగా రాజీనామా చేసినట్లు చెప్పారు.

కాగా తెలంగాణ కోసం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల మాదిరిగానే కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామా బాట పడుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల ఢిల్లీ పర్యటనలో వారికి కేంద్రం నుండి, పార్టీ నుండి తెలంగాణపై ఎలాంటి హామీ లభించక పోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. అదే బాటలో సత్యనారాయణ నడవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+