మగతనం ఉంటే నిరూపించుకో: జగన్‌కు బొత్స సవాల్

Botsa Satyanarayana
అనంతపురం: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మగతనం ఉంటే తాను అవినీతిపరుడిని కాదని నిరూపించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సవాల్ చేశారు. జగన్ ఓదార్పు పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్, ఆయన పార్టీ నాయకులు చేసేవన్నీ రాజకీయ అనుభవం లేని చిల్లర రాజకీయాలని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరన్నారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డియే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.

అనంత ఫ్యాక్షనిజంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి గురివింద గింజలా ఉందని విమర్శించారు. కాంగ్రెసులో ఎప్పుడూ ఫ్యాక్షనిజం సంస్కృతి లేదన్నారు. చంద్రబాబు కాంగ్రెసును విమర్శించాలనే ధోరణితో అవాస్తవాలను ఉద్రేకంగా, అసభ్య పదజాలంతో చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు హయాంలోనే హత్యా రాజకీయాలు జరిగాయన్నారు. అలాంటి బాబు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సమస్య జఠిలమవుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే ఆస్కారమే లేదన్నారు.

అందరినీ ఏకత్రాటి పైకి తీసుకు రావడమే తన పర్యటన ముఖ్యోద్దేశ్యమన్నారు. హిందూపురం నుండి అనంతపురం వరకు జరిపిన తన పర్యటనలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చెప్పానన్నారు. ఈ పర్యటనలో ప్రజలు, రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా రైతులకు చేయూతనిస్తోందన్నారు. పార్టీలో మనలో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా ఇతర పార్టీలు మనపై విమర్శలు చేసినప్పుడు మాత్రం ఏకమయ్యే సంస్కృతి కాంగ్రెసులో మాత్రమే ఉందన్నారు. ఒక కుటుంబంలో విభేదాలు సహజమేనన్నారు. అనంతలోని వెనుకబాటుతనాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి నుండి పలు పథకాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అవకాశాన్ని జిల్లాకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఐడు జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. జిల్లా అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వ పని తీరుపై ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+