సిఎంను వెనుకేసుకోస్తూనే విమర్శించిన శంకర రావు

ముఖ్యమంత్రితో మాట్లాడుతామనుకుంటే ఆయన తనకు అపాయింటుమెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తనను బర్తరఫ్ చేస్తానంటే తాను స్వాగతిస్తానని చెప్పారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలను గడవులోగా కోర్టుకు సమర్పిస్తానని చెప్పారు. అధిష్టానానికి తనపై నమ్మకం ఉంది కాబట్టే మంత్రిగా ఉన్నానన్నారు. ఇప్పటికైనా వారికి నమ్మకముంటేనే మంత్రిగా కొనసాగుతానని చెప్పారు. కాగా సమాచార హక్కు చట్టం కింద ఆయన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను కోరారు.












Click it and Unblock the Notifications