కిరణ్‌కు చెక్: పక్కా వ్యూహంతో వెళుతున్న బొత్స

కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి బహిరంగ సభలను ఆగమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆయనకు కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పథకాల పట్ల ప్రజల నుండి ఆశించిన స్థాయిలో లేదు. బొత్స సైతం సైతం ప్రభుత్వ పథకాలకు కాంగ్రెసు భాగస్వామ్యం కల్పించే దిశలో దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతి విషయంలోనూ ఒంటెద్దు పోకడలకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కీలక అంశాలను సైతం మంత్రివర్గంలో, పార్టీలో చర్చించడం లేదన్న ఆరోపణలు సిఎం ఎదుర్కొంటున్నారు. కానీ బొత్స మాత్రం పార్టీలో మమేకమవుతూ పని చేస్తున్నారు. జిల్లాలలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. సిఎం మాత్రం ప్రభుత్వంపై పట్టు పెంచుకునే దిశలో పార్టీని పెద్ద క్యాడర్‌ను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. మొదట తనకు సన్నిహితులైన మంత్రులనూ క్రమంగా ఆయన దూరం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బొత్స మాత్రం క్రమంగా అందరికీ దగ్గరవుతున్నారు.
ఇక రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి కారణమైన తెలంగాణ అంశం విషయంలో సిఎంకు ఓ స్పష్టత లేదు. తెలంగాణ విషయం వస్తే ఆయన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు, చర్యలు తెలంగాణలో ఆగ్రహావేశాలు కలిగిస్తున్నాయి. పోనీ సీమాంధ్రలో ఆయనకు మద్దతు పెరుగుతుందా అంటే అదీ లేదు. పిసిసి చీఫ్ కాకముందు బొత్స తెలంగాణకు ఓకే చెప్పారు. దీంతో తెలంగాణవాదుల్లో అప్పటికే సానుకూలత పెంచుకున్న బొత్స ఇప్పుడు సీమాంధ్రలో వరుస పర్యటనల ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. సకల జనుల సమ్మె పైనా బొత్స ఆచితూచి మాట్లాడుతున్నారు. సమ్మెను విరమించాలని ఆయన ఉద్యోగులకు విజ్ఞప్తి చేయడం, తన శాఖలో ఇటీవల ఏర్పడిన రగడ విషయంలోనూ తనకు తెలియకుండా ఆర్డర్ పాసైందని చెప్పడం ద్వారా తెలంగాణవాదుల్లో ఉన్న అనుకూలతను నిలుపుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా కిరణ్‌కు ఆ అవకాశం లేక పోవడం గమనించాలి.
ఇక ప్రజాధరణ కలిగిన చిరంజీవితో బొత్స సత్సంబంధాలు నెరపుతుండగా ముఖ్యమంత్రి దిశలో వెళ్లినట్లుగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి చిరు తనకు పోటీ అవుతారని తెలిసినా బొత్స ఆయనతో కలివిడిగా ఉండటం ఆయనకు ప్లస్ అవుతుందనే చెప్పవచ్చు. గత నెల 25న ఉత్తరాంధ్రలో జరిగిన పిఆర్పీ విలీన సభలో బొత్స సొంత ఇలాఖాలో సత్తా చాటారు. చిత్తూరులో మాత్రం సిఎంకు అంత సీన్ లేదనే చెప్పవచ్చు. ఏరికోరి ఎన్నుకున్న కిరణ్ పట్ల అధిష్టానం ప్రస్తుతం అసంతృప్తితోనే ఉంది. దానిని గమనించిన బొత్స అదును చూస్తూ అప్పుడప్పుడు కిరణ్‌కు వ్యతిరేకంగా నివేదికలు కూడా పంపిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications