శ్రీ సత్యసాయి ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా రాజీనామా

తన పదవికి రాజీనామా చేయడంతో సోమవారం ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ సఫాయాకు అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వైద్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. సఫాయా గతంలో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ) డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పదవీవిరమణ అనంతరం పుట్టపర్తికి చేరుకుని 1992లో సత్యసాయిబాబా సూచనల మేరకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టారు.
మార్చి 28న సత్యసాయిబాబా అనారోగ్యంతో పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఏప్రిల్ 24న మరణించారు. అప్పటి నుంచి సఫాయా తన విధుల్లో పూర్తిగా నిమగ్నం కావడం లేదని సమాచారం. 75 ఏళ్ల వయసులో విధులు నిర్వహించడం కష్టమని, తన పదవికి రాజీనామా చేస్తానని ట్రస్టు వారికి తెలిపినట్లు సమాచారం. దీంతో ఈనెల 7వ తేదీ నుంచి పూర్తిగా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications