కోమటిరెడ్డి రాజీనామా ఆమోదంతో సిఎం హెచ్చరిక

తాము రాజీనామా చేస్తే ఆమోదం పొందుతుందేమోననే భయాలను తెలంగాణ మంత్రులకు కలిగించడానికి కోమటిరెడ్డి రాజీనామా ఆమోదాన్ని ప్రయోగించినట్లు చెబుతున్నారు. గతంలో జూపల్లి కృష్ణా రావు చేసిన రాజీనామాను కూడా అదే రీతిలో ఆమోదించి కొంత మేరకు మంత్రుల దూకుడును ఆపగలిగినట్లు భావిస్తున్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్వాసన చెప్పవచ్చునని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇది కూడా రాజీనామా ఆమోదానికి పనిచేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications