మగతనముంటే ఆమోదించు: బొత్సకు అంబటి

ఆయనకు ఆమోదించే దమ్ము లేక ఆమోదించుకోవాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. పార్టీకి, శాసనసభ్యత్వాలకు తమ వర్గం ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు ఆమోదించాల్సింది వారేనన్నారు. రాజీనామాలు ఆమోదించే దమ్ములేకే బొత్స విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు 78 మంది శాససనభ్యులు రాజీనామా చేశారని వారందరి రాజీనామాలు ఆమోదిస్తే మధ్యంతర ఎన్నికలు వస్తాయనే భయంతోనే కాంగ్రెసు ఆమోదానికి వెనక్కి తగ్గుతోందన్నారు. బొత్స పదవుల కోసం తాపత్రయ పడుతున్నారన్నారు.
మొదట బొత్స రాజీనామాలు ఆమోదిస్తే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరు వస్తారో తెలుస్తుందన్నారు. చిరంజీవి ఇప్పటికే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందున ఆయన ఆదుకుంటాడనే ప్రశ్నే తలెత్తదన్నారు. అయినా రాజీనామాలు చేసింది 78 మంది అయితే పద్దెనిమిది మందితో ఆయన ఎలా ప్రభుత్వాన్ని ఆదుకుంటాడన్నారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు సహచర మంత్రులపై ఆరోపణలు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications