తెలంగాణపై ప్రధాని మన్మోహన్ మళ్లీ అదే మాట

ఇదిలా వుంటే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కలిశారు. తెలంగాణపై ఆయన సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మెను విరమింపజేయడానికి తమ నుంచి ఏదో ఒక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉందని ఆయన సోనియాకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటనతో తెలంగాణపై వేడి మరింత పెరిగింది. తెలంగాణ నాయకులను, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రణబ్ ముఖర్జీ ప్రకటన ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ సోనియాతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications