తెలంగాణ ఇవ్వబోమని తేల్చేసిన ప్రణబ్, మాటల్లో తేడా

Pranab Mukherjee
హైదరాబాద్: తాము తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోమని, తెలంగాణ రాష్ట్ర డిమాండుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోమని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశారు. ప్రత్యేక తెలంగాణ వల్ల అనేక సమస్యలు వస్తాయని చెప్పడం ద్వారా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము సుముఖంగా లేమని చెప్పారు. నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ అంశాన్ని పరిష్కరించలేమని చెప్పడం ద్వారా తెలంగాణ సమస్యను నాన్చడానికే కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు అర్థమవుతోంది. తెలంగాణపై కీలకమైన చర్చలు జరుపుతూ, ఆ అంశాన్ని తేల్చాల్సిన బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీపైనే పెట్టారు. అందువల్ల ప్రణబ్ ముఖర్జీ మాటలను పార్టీ వైఖరిగానే తీసుకోవాల్సి ఉంటుంది.

గతంలో పశ్చిమ బెంగాల్‌లోనే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని ఇతర ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లతో పోల్చలేమని, తెలంగాణను వాటితో ముడిపెట్టలేమని గతంలో ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. గత 56 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉందంటూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు అవే మాటలను వ్యతిరేకంగా వాడారు. పైగా, ప్రాంతాల మధ్యనే విభేదాలు ఉన్నాయనే కొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ సమస్యపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేని స్థితిని ప్రాంతాలకు ముడిపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానే ఒక వైఖరిని చెప్పాల్సిన అవసరాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తామని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. తద్వారా తెలంగాణ ఉద్యమంపై ఉక్కు పాదం మోపాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. తీవ్రమైన బలప్రయోగం చేస్తే తప్ప ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచలేని స్థితి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+