అందుకే బాబును టి - టిడిపి నేతలు విమర్శిస్తున్నారా?

ఇటీవల చంద్రబాబు తీరుపై టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, జైపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణపై బాబు వైఖరి స్పష్టంగా లేదని చెప్పిన ఎర్రబెల్లి ఆ తర్వాత అధినేత వద్దకు వెళ్లి తాను అలా అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇలా తెలంగాణ సెంటిమెంటు బలంగా బహిర్గతమవుతున్న ప్రస్తుత తరుణంలోనూ పలువురు తెలంగాణ నేతల తీరు బాబు సిద్ధాంతాలాగే ఉంది. పార్టీ వైఖరిపై విమర్శలు చేయాలని అనుకుంటూనే వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ కోసం తాము ఉద్యమిస్తామని చెబుతూనే మరోవైపు తెలంగాణపై ఏ వైఖరి ప్రకటించని చంద్రబాబునూ వదిలేది లేదన్నట్లుగా స్టేట్‌మెంట్లూ ఇస్తున్నారు. బాబు తటస్థ వైఖరి కారణంగా వారు తెలంగాణ రాష్ట్ర సమితిని ధీటుగా ఎదుర్కొన లేక పోతున్నారు.
తెలంగాణను ఇచ్చే తెచ్చే స్థితిలో లేని టిడిపి వైఖరి తెలంగాణలో అగమ్య గోచరంగా ఉండగా ఇచ్చే తెచ్చే పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెసు పరిస్థితి మాత్రం తెదేపా కంటే కాస్త మెరుగ్గా ఉండటం విశేషం. ఓ వైపు చంద్రబాబు కావాలంటూ మరోవైపు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని చెబుతున్న తెలంగాణ తెదేపా నేతలను తెలంగాణవాదులు విశ్వసిస్తున్నట్లుగా కనిపించడం లేదు. అందుకే వారు తెలంగాణ కోసమంటూ అందరికంటే మొదట రాజీనామా చేసినా, కెసిఆర్ తన కుటుంబం కోసం, ఆస్తుల పెంచుకోవడం కోసం తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పినా తెలంగాణవాదులు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications