కెసిఆర్‌పై ధ్వజమెత్తిన టి - టిడిపి ఎమ్మెల్యే మోత్కుపల్లి

కెసిఆర్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇవ్వబోమని చెబుతున్న కాంగ్రెసు నాయకులతో కెసిఆర్ చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లడమేమిటని ఆయన అడిగారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో ఆటలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాలేదనే కెసిఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయి పార్టీని పెట్టారని, మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టి ఉండేవారు కారని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కెసిఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications