ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కన్నుమూత

మొబైల్ కమ్యునికేషన్స్‌ను మార్పిడి చేసిన గాడ్జెట్ ఐఫోన్‌ను విడుదల చేసిన మర్నాడే ఆయన కన్ను మూశారు. స్టీవ్ జాబ్స్ మరణించారని ప్రకటించడానికి తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఆపిల్ బోర్డు డైరెక్టర్లు ప్రకటించారు. ప్రముఖ టెక్కీ స్టీవన్ పాల్ జాబ్స్ స్టీవ్ జాబ్స్‌గా ప్రసిద్ధి పొందారు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో 1955 ఫిబ్రవరి 24వ తే్దీన జన్మినంచారు. ఆయన లారెన్ పాల్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు












Click it and Unblock the Notifications