కాంగ్రెసుకు తెలంగాణపై టి-టిడిపి నేత ఎర్రబెల్లి హెచ్చరిక

తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చవద్దని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన అన్నారు. ఫార్ములాలతో, కమిటీలతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ముందుకు వస్తే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర నాయకులను కూడా చర్చలకు పిలవడాన్ని గుర్తు చేస్తూ విద్వేషాలు లేకుండా విడిపోవడానికి సీమాధ్ర నాయకులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ కాంగ్రెసు అంతర్గత వ్యవహారం కాదని ఆయన అన్నారు. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications