తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుంది: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ వచ్చే దాకా సమ్మె కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. అరెస్టులు ఆపేయాలని, తెలంగాణ ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ - 2 పరీక్షలను వాయిదా వేయాలని, ఇందుకు మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. అక్టోబర్ మూడో వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకుంటామని ఆయన చెప్పారు.

రేపు ఆదివారం రెండు బృందాలు సింగరేణి బొగ్గు గనులకు వెళ్తాయని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీన మహాధర్నా ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులోని విద్యా సంస్థలను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్ రోకో కార్యక్రమం తర్వాత 15వ తర్వాత మళ్లీ సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి జ్యుడిషియల్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడానికి ప్రయత్నిస్తే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. సకల జనుల సమ్మె వేడి కేంద్రానికి తాకిందని, ఢిల్లీ వేడెక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఈగ వాలినా సహించబోనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+