జీవితంతో సంతృప్తి, టెక్కీ దంపతుల ఆత్మహత్య

టెక్కీ దంపతులు ఇంగ్లీషులో ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. తమ కలిసిమెలిసి మంచి, సంతృప్తికరమైన జీవితం గడిపామని, తాము ప్రపంచమంతా తిరిగామని, వివిధ దేశాల్లో నివసించామని, తాము చాలా డబ్బు సంపాదించామని, ఇంత సంపాదిస్తామని తాము ఎన్నడూ అనుకోలేదని, తాము వస్తువులు కొనడానికి సాధ్యమైనంత ఎక్కువ ఖర్చు చేశామని, అది తమకు ఎంతో సంతోషం ఇచ్చిందని, తమ జీవితం తమదేనని భావిస్తున్నామని, జీవించడానికి తమకు ఎంత హక్కు ఉందో మరణించడానికి కూడా అంతే హక్కు ఉందని భావిస్తున్నామని వారు ఆ నోట్‌లో రాశారు. తమకు ఆస్తులు గానీ అప్పులు గానీ లేవని వారు అందులో చెప్పారు.












Click it and Unblock the Notifications