హైదరాబాద్‌పై సంప్రదింపులను అంగీకరించం: నాగం

1956కు ముందున్న హైదరాబాదు రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని, ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంప్రదింపుల పేరుతో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి మెడ పట్టి బయటకు గెంటేస్తే కర్నూలులో రాజధానిని పెట్టుకున్నారని, రాజధానిని చేసుకోవడానికి చాలా పట్టణాలు సీమాంధ్రలో ఉన్నాయని ఆయన అన్నారు. రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను వేటినీ తాము అంగీకరించబోమని ఆయన అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల్లో విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications