అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న తెలంగాణ ఎంపీలు

తెలంగాణకు అనుకూలంగా సోమవారం సాయంత్రం పార్టీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడుతుందని భావించిన తరుణంలో అది వెనకపడిపోయిన భావన కలుగుతోంది. ఈ స్థితిలో అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచాలని, అందులో భాగంగా తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి సిద్ధపడాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద ఇంకా పెండింగులో ఉన్నాయి. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లోగా వాటిపై నిర్ణయం తీసుకుంటానని అప్పట్లో స్పీకర్ చెప్పారు. కానీ వాటిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications