టిడిఎల్పీ ఆఫీసులో మంత్రి శంకర రావు హంగామా

అనంతరం శంకర రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే ఆ పార్టీలో ఉన్న అవినీతి నేతలపై ఉద్యమిస్తున్న తీరును వారు అభినందించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు అవినీతిని చీల్చు చెండాడుతున్నారంటూ మోత్కుపల్లి ఆయనను పొగిడారట. కాగా మంత్రి శంకర రావు ఏం చేసినా హాట్ టాపిగ్‌గా మారటం సర్వ సాధారణమై పోయింది. తోటి మంత్రులపై, ముఖ్యమంత్రిపై, పార్టీ నేతలపై విమర్శలు చేయడం, పిఎపై చేయి చేసుకోవడం తాజాగా టిడిఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆయన చర్యలన్నీ సెన్షేషన్ క్రియేట్ చేస్తుంటాయి.












Click it and Unblock the Notifications