డిజిపి దినేష్ రెడ్డిపై తెలంగాణ నేతల గుర్రు

ఎట్టి పరిస్థితుల్లో రైలు రోకో చేసి తీరుతామని దమ్ముంటే దాన్ని అడ్డుకోవాలని సిద్దిపేట టిఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు సవాల్ విసిరారు. డిజిపి తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదన్నారు. డిజిపికి దమ్ముంటే తమను అరెస్టు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అన్నారు. అరెస్టులు చేసినా ఉద్యమం ఆగదన్నారు. ఈ సందర్భంగా వాళ్లు ఓయులో డిజిపి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డిజిపి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications