తెలంగాణ కోసం దీక్ష, సిపిఐ ఎమ్మెల్యే అరెస్టు

Khammam District
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఇంటికి తరలించి గృహనిర్బంధం విధించారు. అక్కడే ఆయన దీక్ష కొనసాగించారు. తనకు గృహనిర్బంధం విధిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. దీంతో ఆయనను రెండవ పట్టణం పోలీసు స్టేషనుకు తరలించారు. కూనంనేనని అరెస్టుకు నిరసనగా తెలంగాణ జెఎసి నేతలు రాస్తారోకో నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన తమ పార్టీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాదులో ఖండించారు. కూనంనేని దీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూనంనేని అరెస్టును ఖండిస్తూ సిపిఐ మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆందోళనకు పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+