తెలంగాణ ప్రకటన వస్తేనే సమ్మె విరమణ: స్వామి గౌడ్

తెలంగాణ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని తాము కోరినట్లు శ్రీనివాస గౌడ్ చెప్పారు. తెలంగాణపై కేంద్రం చేత సానుకూల ప్రకటన చేయించాలని తాము మంత్రులను కోరినట్లు స్వామిగౌడ్ చెప్పారు. కేంద్రంతో సానుకూల ప్రకటన చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వోద్యోగుల మూడు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆ డిమాండ్లపై ముఖ్యమంత్రితో మాట్లాడుతామని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. చర్చల్లో పురోగతి కనిపించిందని ఆయన అన్నారు. సానుకూల వాతావరణంలోనే తెలంగాణ ఉద్యోగులతో చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై త్వరలో సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications