దానం నాగేందర్‌ను టార్గెట్ చేసిన మంత్రి శంకరరావు

సికింద్రాబాదు అడ్డగుట్ట ఘటనకు సంబంధించిన మంత్రి దానం నాగేందర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. శంకరరావు పట్టు మేరకే దానంపై ఆ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఆదివారం ఉదయ అడ్డగుట్టలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన నాగేంద్ర కాన్వాయ్‌పై కొందరు కోడిగుడ్లు విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి అనుచరులు ఆందోళనకారులపై ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనపై శ్రవణ్ కుమార్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తుకారాంగేట్ పోలీసు స్టేషనులో దానపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కింద కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications