దానంపై గుడ్లు, చితకబాదిన మంత్రి అనుచరులు

దీంతో ఆయన అనుచరులు రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. వారిని చితకబాదారు. వారు తెలంగాణవాదులపై ఇష్టారీతిగా కర్రలతో దాడి చేసినప్పటికీ మంత్రి చూస్తూ ఉండిపోయారు. ఇరువర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దానం అనుచరులను అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. దానం కారును అడ్డుకున్న తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అనుచరుల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే మంత్రి అనుచరుల దాడిని ఖండిస్తూ తెలంగాణ న్యాయవాదుల ఐకాస తుకారాం గేటు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. తన సమక్షంలోనే ఆయన అనుచరులు తెలంగాణవాదులపై దాడి చేస్తూంటే చూస్తూ ఊరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రిపైనా, ఆయన అనుచరుల పైన కేసులు పెట్టే వరకు తాము పిఎస్ ముందు నుండి వెళ్లేది లేదని బైఠాయించారు.












Click it and Unblock the Notifications