సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్తం, అరెస్టు

మంత్రి జానారెడ్డి ఇంటిని తెలంగాణ లాయర్ల ఐక్య కార్యాచరణ సమితి ముట్టడించింది. సకల జనుల సమ్మెను విరమించాలని చేసిన ప్రకటనకు నిరసనగా వారు ఆందోళన చేపట్టారు. సమ్మెను విరమించాలని కోరటం కాదని మీరే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాయర్లను అరెస్టు చేసి బంజారాహిల్సు పోలీసు స్టేషన్‌కు తరలించారు. జానారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల తెలంగాణవాదులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications