మహిళపై దౌర్జన్యం: ఎమ్మెల్యే వేణుగోపాల చారి అరెస్టు

సోమవారం ఎమ్మెల్యే అందుబాటులో లేక పోవడంతో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే తనపై తప్పుడు కేసు బనాయించారని ఎమ్మెల్యే అంటున్నారు. తనకు సంబంధం లేని కేసులో తనను ఇరికించి అప్రతిష్ట పాలు చేయాలని స్థానిక కాంగ్రెసు నేతలు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా దాడిలో గాయపడ్డ మహిళ భైంసా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కాగా ముథోల్ నుండి గత 2009 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన వేణుగోపాల చారి ఇటీవల తెలంగాణ ఉద్యమం బలపడుతున్న సమయంలో ఆ పార్టీకి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇటీవలె ఎమ్మెల్యే పదవికి రెండోసారి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications