తెలంగాణ తేలింది, టిఆర్ఎస్‌కూ తెలుసు: లగడపాటి

బాన్సువాడ ఉప ఎన్నికలపై స్పందిస్తూ ఉత్తర తెలంగాణలోనే కాంగ్రెసు ఇంత బలంగా ఉంటే ఇక దక్షిణ తెలంగాణలో భవిష్యత్తులో కాంగ్రెసు గెలుపు ఖాయమన్నారు. బాన్సువాడలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్‌కు భారీ ఓట్లు రావడం తెలంగాణ కాంగ్రెసులో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పని చేస్తుందన్నారు. ఎన్నికలు వస్తే లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉద్యమ విరమణకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సిద్ధమయ్యారన్నారు. కూకట్ పల్లిలో కార్పోరేటర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని ఎందుకు నిలబెట్ట లేకపోయిందని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెసు పార్టీ చాలా బలంగా ఉందన్నారు. బాన్సువాడ కాంగ్రెసుకు అనుకూలం కాదని అయినప్పటికీ ధరావత్తు దక్కించుకున్నామన్నారు. ప్రచారానికి అగ్రనేతలు వెళ్లి ఉంటే మరిన్ని ఓట్లు సాధించి ఉండేవారమన్నారు. తెలంగాణపై ఎప్పుడో తేలిపోయిన విషయం తెలిసినప్పటికీ ఎలక్షన్లు కలెక్షన్ల కోసమే తెరాస హంగామా చేస్తోందన్నారు. సమ్మె సకల జనులది కాదని ఉద్యోగులది మాత్రమేనని స్వామి గౌడే చెప్పారన్నారు. సకల జనుల సమ్మెకు తెలంగామ ప్రజల మద్దతు లేదు కాబట్టే నేతలు అరెస్టు కాగానే రైలు రోకోకు స్పందన కరువైందన్నారు.












Click it and Unblock the Notifications