ముఖ్య నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడే చెప్పను: కెకె

తెలంగాణ నేతలను అరెస్టు చేయడాన్ని తాము తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే చర్యగానే తాము చూస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ చర్యను ఖండించడానికి పదజాలం సరిపోదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విజయశాంతి పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే తెలంగాణ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని ఆయన విమర్శించారు. తెలంగాణను సాధించే విషయంలో రాజీలేదని, రాజీనామాలపై కూడా రాజీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications