వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంపై నాగం నిప్పులు, కూనంనేని దీక్ష విరమణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
ఖమ్మం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం ఖమ్మంలో విమర్శించారు. సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివ రావు ఆమరణ నిరాహార దీక్షను నాగం జనార్ధన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే అంతకంతకు ఉద్యమం ఎగుస్తుందని నాగం అన్నారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.

కూనంనేని దీర్ఘకాలిక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గత ఆరు రోజులుగా కూనంనేని హాస్పిటల్లోనే తెలంగాణ ప్రకటించాలని దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీక్ష సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు హాస్పిటల్ తరలించారు. బుధవారం కోర్టు ఆయనకు బెయిలు కూడా మంజూరు చేసింది.

English summary
Telangana Nagara Samithi chairman Nagam Janardhan Reddy fired at CM Kiran Kumar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X