అన్నా హజారే ప్రాణాలకు ముప్పు, భద్రతపై సమీక్ష

అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన భద్రతపై సమీక్ష జరపాలని మహారాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అహ్మద్ నగర్ ఎస్పీని ఆదేశించారు. అదనపు పోలీసు బలగాలను పంపాలని కూడా సూచించారు. ప్రస్తుతం అన్నా హజారే తన స్వగ్రామంలో మౌనవ్రతం సాగిస్తున్నారు. హర్యానాలోని హిస్సార్‌లో కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం అన్నా హజారే వల్లనే జరిగిందనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications