అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మవరం హత్య కేసులో ముగ్గురు లొంగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur District
హైదరాబాద్: అప్పట్లో సంచలనం సృష్టించిన ధర్మవరం హత్యల కేసులో ముగ్గురు నిందితులు బుధవారం డిజిపి దినేష్ రెడ్డి ముందు లొంగిపోయారు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డితో పాటు అతని అనుచురుడు రవీంద్రా రెడ్డి, మరో అనుచరుడు డిజిపి ఎదుట లొంగిపోయారు. గత నెల 14వ తేదీన అనంతపురం జిల్లా కామిరెడ్డిపల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. బోయపల్లి నర్సింహులు, అతని కుమారుడు ఆంజనేయులు, కూతూరు పద్మావతిలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. బాలింత అని కూడా చూడకుండా పద్మావతిని హత్య చేశారు.

ఆ హత్య కేసులో 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ముగ్గురు ఇదివరకే ధర్మవరం పోలీసు స్టేషనులో లొంగిపోయారు. తాజాగా, కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ రెడ్డి లొంగిపోయాడు. అతని నేర చరిత్ర చాలా పెద్దదని అంటున్నారు. ఫ్యాక్షన్ హత్యల్లో అతని పాత్ర ఉందని సమాచారం. ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత సుధాకర్ రెడ్డి తిరుపతి, తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి అతను లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చివరకు సోమవారం డిజిపి ముందు తన ఇద్దరు అనుచరులతో పాటు లొంగిపోయాడు.

English summary
Three accused in Dharmavaram murder case surrendered before DGP Dinesh Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X