వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: బ్యాంక్ లావాదేవీలపై సిబిఐ ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ముమ్మరం చేసింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ వ్యవహారాలపై సిబిఐ దృష్టి పెట్టింది. వివిధ బ్యాంకుల్లో జగతి పబ్లికేషన్స్ ఆర్థిక లావాదేవీలను సిబిఐ అధికారులు బుధవారం పరిశీలించారు. ఓవర్సీస్ బ్యాంక్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, అలహాబాద్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి తదితర బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను సిబిఐ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

బుధవారం ఒక్క రోజే పది బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. బ్యాంకుల ప్రతినిధులు సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. లావాదేవీల వివరాలను సిబిఐ అధికారులు బ్యాంకుల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. జగతి పబ్లికేషన్స్ భవనాలకు అనుమతులు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు.

English summary
CBI officers questioned GHMC officers in YSR Congress president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X