తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టక పోవడం తప్పే: బొత్స

రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టును అడ్డుకోవద్దని కోరారు. సుప్రీం కోర్టు వద్దంటే ఎవరైనా ప్రాజెక్టులు కట్టే సాహసం చేస్తారా అని ప్రశ్నించారు. టెండర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం కట్టవద్దని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. అలా చెబితే ప్రభుత్వం టెండర్లు పిలిచే సాహసమే చేయదన్నారు. టెండర్ల వివాదం కేసు హైకోర్టులో నడుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారికే టెండర్లు దక్కినట్లు తనకు తెలియదన్నరు. కాగా అంతకుముందు ఆర్టీసి ఇంద్ర బస్సులు ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications