మన పెద్ద రాష్ట్రం సంతోషంగా ఉండాలి: గవర్నర్ ఆకాంక్ష

గవర్నర్ దంపతులను పలువురు ప్రముఖులు కలిసి అభినందించారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెసు నేత చిరంజీవి తన కుటుంబ సభ్యులతో వచ్చి గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాసు వెంకటకృష్ణా రెడ్డి, దానం నాగేందర్, గల్లా అరుణకుమారి, రఘువీరారెడ్డి తదితర మంత్రులు కూడా నరసింహన్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి రాజభవన్‌కు వచ్చి గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications