వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకే టోపీ పెట్టిన ఘనుడు, కటకటాల వెనక్కి

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
ఏలూరు: ఓ ఘరానా మోసగాడు శాసనసభ్యులకే టోపీ పెట్టాడు. కోటేశ్వర రావు అనే ఆ మోసగాడు రాజీవ్ యువకిరణాలు పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పది శాసనసభ్యుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన శానససభ్యులు అతని చేతిలో మోసపోయారు. తాను రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టు డైరెక్టర్‌నని, జిల్లా మంత్రులు సిఫార్సుతో తాను ఉద్యోగాలు ఇప్పించడానికి ముందుకు వచ్చానని చెప్పి ఎమ్మెల్యేల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో ఎమ్మెల్యే నుంచి అతను 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేశాడు.

నర్సాపురం శాసనసభ్యుడు ప్రసాద రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటేశ్వర రావు మోసం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రసాద రాజు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత ఓ మహిళను పట్టుకున్నారు. ఆమె ద్వారా కోటేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. తాను వసూలు చేసిన డబ్బును కోటేశ్వర రావు ఆ మహిళ ఖాతాలోనే జమ చేశాడు. కోటేశ్వరరావు అసలు పేరు తోట బాలాజీ. అతను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వాసి.

English summary
Koteswar Raso was arrested by West Godavari police for cheating MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X