టిఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి, ఓ ఎంపీ కూడా?

మూడవ తారీఖున దీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నవంబర్ 4న ఆయన టిఆర్ఎస్‌లో చేరతారు. ఇప్పటికే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జూపల్లి భేటీ అయి కాంగ్రెసుకు రాజీనామా, దీక్షలో పాల్గొనే అంశం, టిఆర్ఎస్‌లో చేరే అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. జూపల్లితో పాటు జిల్లాకే చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు కూడా టిఆర్ఎస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే జూపల్లి తెలంగాణ కోసం మంత్రి పదవి కోసం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా టిఆర్ఎస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను జూపల్లి ఖండించారు. తాను టిఆర్ఎస్‌లో చేరుతున్నాననే వార్తలు అవాస్తవమన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కోర్టుకు వెళతానని చెప్పారు. నవంబర్ 1వ తేదిన కాంగ్రెసు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసే దీక్షలో పాల్గొంటానన్నారు.












Click it and Unblock the Notifications