జగన్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి అరెస్టు

తనపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని ఆరోపిస్తూ చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన అనుచరులతో ధర్నాకు దిగారు. అంతకు ముందు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ స్థితిలో పోలీసులు చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి వెంట ఎస్పీ కార్యాలయానికి శాసనసభ్యుడు రవి కూడా వచ్చారు. వేధింపు చర్యల్లో భాగంగానే చెవిరెడ్డి భాస్కర రెడ్డిపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. మంత్రి గల్లా అరుణకుమారి ప్రోద్బలంతోనే తమను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. అటవీశాఖ అధికారులను తాను కొట్టలేదని చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications