మజ్లీస్ పట్టు, మేయర్‌గా కార్తిక రెడ్డి కొద్ది రోజులే

కాగా, ఐదో ఏడాది మేయర్ పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కాంగ్రెసు, మజ్లీస్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. మేయర్ పదవి కోసం మజ్లీస్ పట్టుబడుతున్న సమయంలో తన పదవిని కాపాడుకోవడానికి కార్తిక రెడ్డి ముమ్మరమైన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించేలా లేవు. పార్టీలోనే కార్తికరెడ్డికి వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ నాయకత్వం కూడా మజ్లీస్‌కు మేయర్ పదవిని అప్పగించడానికి సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మజ్లీస్‌తో సత్సంబంధాలను కాంగ్రెసు పార్టీ ఆశిస్తోంది. మేయర్ పదవి కోసం మజ్లీస్ పార్టీ ఆరుగురి పేర్లను పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications