వైయస్ జగన్‌కు నోటీసులు ఇవ్వండి: సిబిఐ కోర్టు

YS Jaganmohan Reddy
హైదరాబాద్: సిబిఐ సోదాల వివరాలు ఇవ్వాలన్న పిటిషన్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసు ఇవ్వాలని ఆదాయపన్ను శాఖను సిబిఐ కోర్టు శుక్రవారం మరోసారి ఆదేశించింది. ఆదాయపన్ను శాఖ పిటిషన్‌పై తమ వాదన కూడా వినాలని జగన్ తరఫు న్యాయవాది సోమవారం సిబిఐ కోర్టును కోరిన విషయం తెలిసిందే. దీంతో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని అదే రోజు సిబిఐ కోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. అయితే జగన్‌కు నోటీసులు ఇవ్వలేక పోయామని ఐటి శాఖ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నోటీసు ఇవ్వాలని మరోమారు ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు పోలవరం టెండర్లు రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన పిల్ కూడా శనివారానికి వాయిదా పడింది. టెండర్ ఎవరు దక్కించుకున్నారన్న విషయాన్ని అందులో పోటీదార్లందరికి తెలియజేస్తారా లేదా అన్న సమాచారం చెప్పాలని హైకోర్టు ఎజిని ఆదేశించింది. ఇందులో ప్రభుత్వం అనుసరించే విధానం వివరించాలని, ఈ సమాచారమంతా శనివారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కాగా పోలవరం టెండర్లు ష్యూ కంపెనీకి రావడంపై సోమా, సిజిజిసి కంపెనీలో కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+