కెసిఆర్! సిగ్గు, శరం ఉందా?: మండిపడ్డ దేవేందర్ గౌడ్

Deveder Goud
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మాజీ మంత్రి, టిడిపి నేత దేవేందర్ గౌడ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పోలవరం అంశం వారం రోజులుగా చర్చ జరుగుతుంటే ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారన్నారు. కెసిఆర్ తాము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా తమపై, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పట్ల తన బాధ్యత నిర్వర్తించకుండా, పోలవరం టెండర్ల విషయంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేయకుండా బాబుపై అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీవు ప్రారంభించింది కాదని, యాబయ్యేళ్లుగా ఉందన్నారు. సమ్మె ఉధృతంగా సాగుతుంటే టెండర్ల కోసం తాకట్టు పెట్టావని విమర్శించారు.

రాజాంకు నీకు సంబంధం ఏమిటి, తెలంగాణ గుండె చప్పుడు అన్నప్పుడు నీ పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారిపై నీకు పూర్తిగా ఎందుకు తెలిసి ఉండదు తదితర అంశాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గు చేటన్నారు. నోటి దురుసు చూపించుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టారని, కెసిఆర్ ఖబర్దార్ నీ చరిత్రంతా కడిగేస్తానని హెచ్చరించారు. నీ దళారితంనంపై చర్చకు మేం సిద్ధమని, మేం మాట్లాడితే ఉరి వేసుకోవాల్సి వస్తుందన్నారు. నీ గురించి మాట్లాడటమే సిగ్గుచేటని, సిగ్గు, శరం లేని వ్యక్తివన్నారు. నీ దళారితనం బయటకు రావాల్సి ఉందన్నారు. గతంలో నన్ను వారం రోజులుగా కలిశావు ఇప్పుడు నాపైనే అబండాలు వేస్తావా అని ప్రశ్నించారు. కెసిఆర్ నీ బండారాన్ని బయట పెడతానని హెచ్చరించారు. యూత్ కాంగ్రెసులో కెసిఆర్ దళారి పని చేశారని ఆరోపించారు.

పదకొండేళ్ల బట్టి అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అనే నువ్వు మాగురించి మాట్లాడతావా అని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. క్యాబినెట్లో ఉండి తెలంగాణ గురించి మాట్లాడని నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావన్నారు. కెసిఆర్ పచ్చి అబద్దాల కోరు, ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ వేయమని నీ కొడుకు చెప్పాడా, కూతురు చెప్పిందా అల్లుడు చెప్పాడా చెప్పాలన్నారు. అమ్ముడు పోకుంటే క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగిందన్నారు. మాజీ ఎంపీ సుబ్పిరామిరెడ్డితో లాలూచీ, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకోపై కేసు ఉపసంహరించుకున్న నువ్వు బహిరంగ చర్చకు రా మేం సిద్ధమన్నారు. మొదట పోలవరం టెండర్లలో టిఆర్ఎస్ పాత్ర బయటపడిన తర్వాత చంద్రబాబు ఆస్తులా మరేవైనా చర్చలకు రెడీ అన్నారు. మా గురించి మాట్లాడటానికి సిగ్గు లేదా అన్నారు. పోలవరం టెండర్ల అంశం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి బాబుపై కెసిఆర్ విమర్శలని, విద్యార్థులను విదేశాలకు పంపే విషయంలో కెసిఆర్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కెసిఆర్‌కు దమ్ముంటే కోర్టుకు వెళ్లాలని ఆయనపై 420 కేసు నమోదు చేయాలన్నారు.

మేం కష్టపడి పైకి వచ్చిన వారమని ఉద్యమకారులు ఎలా ఉండాలో సూచిస్తున్నామని ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ నీ అబ్బ జాగీరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందే కొడుకుకు, కూతురుకు, అల్లుడికి, బంధువులకు పదవులు అప్పగించే నీవు దళారివన్నారు. ఉద్యమంలో ఆరువందల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బలయ్యారని నీవు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నావన్నారు. ఢిల్లీ వెళ్లి సోనియాతో ఒప్పందం చేసుకొని, షాపింగ్ చేసి సమ్మెను నాశనం చేసిన ద్రోహివని, తెలంగాణ నీ లక్ష్యం కాదని రాజకీయమే నీ లక్ష్యమని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను బలిపెట్టి సిఎం కావాలని చూస్తున్నావని విమర్శించారు. నీవు ఆడే నాటకాల వల్ల తెలంగాణ రావడం లేదని, తెలగాణ నీ అబ్బ జాగీరా అని ప్రశఅనించారు. సోనియా కాళ్ల వద్ద కుక్కలా బతికావని, దమ్ముంటే రాజీనామా చేసిరా తెలంగాణ వచ్చే వరకు రాజకీయాలకు దూరంగా ఉందామని సవాల్ విసిరారు. బుద్ధిహీనుడా పాసుపోర్టులు అమ్ముకొని బతికినోడివన్నారు. సాయంత్రం తాగి, చీకటి రాజ్యమేలే నువ్వు మా గురించి మాట్లాడుతావా అన్నారు. అవకాశముంది కదా అని సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ప్రజలను బలి చేస్తే ఊరుకోమన్నారు. నేను రాజకీయాలలోకి వచ్చిందే నీలాంటి దొరల పని పట్టడానికన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+