పాల డబ్బులతో చంద్రబాబు పార్టీ: కెసిఆర్ కూతురు

తెలంగాణ ఉద్యమానికి విరామమే తప్ప విరమణ లేదని కవిత అన్నారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని తాము ఇదివరకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని ఆమె చెప్పారు. ఆవసరమైతే కెసిఆర్ మళ్లీ దీక్ష చేస్తారని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు స్వామి గౌడ్‌పై వస్తున్న ఆరోపణల వెనక కుట్ర ఉందని ఆమె అన్నారు. చార్మినార్ పునర్వైభవంకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని తాను షెల్జాను కోరినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications