ఎక్కడైనా చర్చకు సై: చంద్రబాబుపై శివమెత్తిన కెసిఆర్

బాబు అసలు పేరే కుంభకోణమన్నారు. నీతి గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిండమేనని, అన్నాహజారే ఫోటో పక్కన పెట్టుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఆయన బతుకే బినామీ బతుకులన్నారు. నాకున్న వాటిని నా పేరు మీదే బాజాప్తా పెట్టుకున్నానని కానీ ఆయనకు ఆ దమ్ము లేదన్నారు. పదకొండేళ్లుగా తాము ఇలాంటి కారుకూతలు చూస్తున్నామని ఇలాంటి వాటికి భయపడి తాము వెనక్కి వెళ్లేది లేదన్నారు. లక్ష్యాన్ని ముద్దు పెట్టుకునే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. నాపై బాబు ఆయన తొట్టి గ్యాంగ్ నాలుగు రోజులుగా తనపై కారుకూతలు కూస్తున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ రాకుండా మాత్రమే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేని టిడిపి కాంగ్రెసుతో కుమ్మక్కైందన్నారు. ప్రజల్లోకి వెళ్లే మొహం లేని టిడిపికి తెలంగాణ రాష్ట్రం వచ్చాక శంకరగిరి మాన్యాలే గతి అన్నారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.
2009 ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఉండి ఆ తర్వాత యు టర్న్ తీసుకొని తెలంగాణ ప్రజలను బాబు మోసం చేశారన్నారు. బాబుది మిత్ర ద్రోహం, నమ్మక ద్రోహం అలాంటి వ్యక్తి కారు కూతలు ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. తనకు కేవలం 24 ఎకరాల భూమి, హైదరాబాదులో ఇల్లు మాత్రమే ఉందన్నారు. తనకు అంతకుమించిన ఆస్తులు లేవన్నారు. నమస్తే తెలంగాణలో తనకు నాలుగు కోట్లు, టీవిలో రూ.55 లక్షల పెట్టుబడులు ఉన్నాయన్నారు. అప్పు చేసి తెలంగాణ కోసం వాటిని మీడియాలోకి తరలించానన్నారు. తాను వసూల్ రాజాని అన్న చంద్రబాబు పార్టీని ఎలా నడుపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా పార్టీని నడపాలంటే నిధులు సేకరించాల్సిందేనన్నారు. పదేళ్ల క్రితమే బాబు బాగోతం గురించి తెహెల్కా బయటపెట్టిందన్నారు. నా దగ్గర యాభైవేల కోట్లు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. మేం పవిత్రమైన లక్ష్యంకోసం ఉద్యమిస్తున్నామని నాపై ఎంత బరువు బాధ్యతలు ఉన్నాయో తనకు తెలుసునన్నారు. బాబు తన జీవితంలో ఒక్కరోజైనా నిజాయితీగా బతికారా అన్నారు. బాబు వైఖరి యూజ్ అండ్ త్రో అన్నారు. ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేసే చంద్రబాబు సిఎంను లోకాయుక్త పరిధిలోకి తీసుకు రావాలంటే పారిపోయాడన్నారు.
తనపై చేసిన ఆరోపణలకు టిడిపి క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామన్నారు. తనపై ఆరోపణలకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నిబద్దత లేకుండా తెలంగాణకు నీవు చేసిన ద్రోహానికి మీ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిని విడిచి వస్తున్నారన్నారు. వారిని డబ్బులతో కొని ఆపాలనే నీచస్థితికి దిగజారారని విమర్శించారు. పోలవరం టెండర్లు దక్కించుకున్న ష్యూ కంపెనీలో నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన రాజాంకు కేవలం మూడు శాతం పెట్టుబడులు మాత్రమే ఉన్నాయన్నారు. రాజాం వ్యాపార వేత్త అని ఆన ఎక్కడ బిజినెస్ చేస్తున్నారో తనకేం తెలుసున్నారు. తెలంగాణ కోసం పత్రికలో పెట్టుబడులు పెట్టమని రాజాంను కోరితే ఆయన పెట్టారని ఆయన వ్యాపారాలతో తనకు సంబంధం లేదన్నారు. యన వ్యాపారాలతో తనకు సంబంధం లేదన్నారు. బాబు కారుకూతలు కూసి పార్టీని నిలబెట్టుకుందామనుకుంటే అది కలే అవుతుందన్నారు. తాను బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధమన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా బాబు విష కౌగిలి నుండి బయటకు రావాలన్నారు. పోలవరంపై ఆరేళ్లుగా టిఆర్ఎస్ హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ నేతలు బాబు బూట్లు తుడవడానికి ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం నా ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధపడ్డాను, అలాంటి నాపై అవాకులు చెవాకులు పేలుతారా అని ధ్వజమెత్తారు. నిత్యం పార్టీలు మారే దేవేందర్ గౌడ్, రేషన్ షాపు డీలర్ నుండి నేత అయిన ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు నాయకులా అని ధ్వజమెత్తారు. తెలంగాణ టిడిపి నేతలకు సిగ్గు లజ్జ ఉంటే పోలవరంపై తమ విధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications