కారు అపకుండా వెళ్లిన మంత్రి, పోలవరం వద్ద భద్రత

Dharmana Prasad Rao
హైదరాబాద్: కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ బాధిత కుటుంబాలను అడ్డుకోవడంతో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తన కారు ఆపకుండానే వెళ్లిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. థర్మల్ పవర్ ప్లాంట్ల బాధిత కుటుంబాలను ఆయన ఇంతవరకు పరామర్శించక పోవడంతో అక్కడకు వచ్చిన మంత్రిని అడ్డుకునేందుకు గ్రామస్తులు చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకుని అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అక్కడకు చేరుకున్న మంత్రి తన కారును ఆపకుండానే వెళ్లి పోయారట. దీంతో బాధితులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఉస్మానియా విశ్వవిద్యాలయ జెఏసి వస్తుందని తెలియడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీగా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఇటు తెలంగాణవాదులు, అటు సీమాంధ్రవాదులు వస్తారని తెలియటంతో భారీగా పోలీసులను మోహరించారు. రోడ్డు, జలమార్గాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+