మిస్టర్ కెసిఆర్! జాగ్రత్త: సవాల్ స్వీకరించిన టిటిడిపి

బడుగులు ఎదగడం ఆయనకు ఇష్టం లేదన్నారు. అందుకే వరంగల్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కొట్టించారన్నారు. కెసిఆర్ మరో చెన్నారెడ్డి అని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అన్న కెసిఆర్ మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నారన్నారు. కెసిఆర్ వ్యక్తిగత సంపాదన కోసమే ఉద్యమం అన్నారు. కెసిఆర్ తన కుటుంబం ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఓడల మంత్రిగా ఆయన ఎన్ని ఓడలు సంపాదించారో చెప్పాలన్నారు. కెసిఆర్ పోలవరం విషయంలో వాస్తవాలు దాచి మాట్లాడారన్నారు. ఆయన అవినీతి నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పోలవరం టెండర్ల వల్లే సమ్మె ఆగిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications