ఆమరణ దీక్షపై తగ్గమన్న ఎంపీలు నో అన్న కోమటిరెడ్డి

వారి విన్నపాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను దీక్షపై వెనక్కి తగ్గేది లేదన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీక్ష విరమించాలని ఎంపీలు తనను కోరారని కానీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షపై వెనక్కి తగ్గేది లేదన్నారు. దీక్ష యథాతథంగా ఉంటుందన్నారు. సానుకూల ప్రకటన వచ్చే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఎంపీలు మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం పదిహేను రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశముందన్నారు. కేంద్రం నుండి సానుకూల ప్రకటన వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications