జై కిరణ్: తెలంగాణ ఎమ్మెల్యేల తాజా స్లోగన్

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల సందర్భంగా నవంబర్ 1వ తేదీన నిరసన తెలియజేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, తెలంగాణలోని రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై నవంబర్ 1వ తేదీన తిరిగి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications