జగన్ ఆస్తుల కేసు: వి హనుమంత రావు సలహా

V Hanumanth Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసులను వేగవంతం చేయాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శుక్రవారం అన్నారు. జగన్ సంపాదించిన ఆస్తి అంతా అక్రమమైనదేనని ఆయన అన్నారు. ఆయన దగ్గర ఉన్న ప్రతి పైసా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రహైజా, ఎమ్మార్ కంపెనీల నుండి భూములను వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు.

కొందరు ఐఏఎస్ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కలెక్టర్ నవీన్ మిట్టల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటేనే మిగతా ఐఏఎస్‌లు భయంతో పని చేస్తారన్నారు. అవినీతిపరులకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిందనుకుంటే పొరపాటన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం కొనసాగుతుందన్నారు. సకల జనుల సమ్మె అహింసాయుతంగా జరిగిందన్నారు. రచ్చబండలో జిల్లాకు 30వేల ఇళ్లు నిర్మించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+