టిఆర్ఎస్‌లోకి మరో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

Telangana
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రంలోగా ఆయన తాను టిఆర్ఎస్‌లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్‌లో చేరే దిశలో ఆయన శనివారం ఉదయం తన అనుచరులతో భేటీ అయ్యారు. అనుచరుల సూచనల మేరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్‌లో చేరడమే ఉత్తమంగా ఆయనతో పాటు అనుచరులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సోమారపు సత్యనారాయణ 2009 ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఆయన టిడిపిలో ఉన్నారు. అప్పటి ఎన్నికల్లో టిడిపి తనకు టిక్కెట్ కేటాయించక పోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన నియోజకవర్గం పరిధిలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. వారి అండతోనే ఆయన గెలిచారు. ఇటీవల జరిగిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు ప్రముఖ పాత్ర వహించారు. భవిష్యత్తు దృష్ట్యా టిఆర్ఎస్‌లో చేరితే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సమ్మె అనంతరం టిఆర్ఎస్‌లో చేరాలనే ఒత్తిళ్లు ఆయనపై వచ్చినట్లుగా తెలుస్తోంది. 2009లో గెలిచిన తర్వాత ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెసు అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల తెలంగాణ కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+