ఉద్యమాన్ని అణిచి వేయడానికి చంద్రబాబు కుట్ర: నాగం

వారికి చిత్తశుద్ధి ఉంటే బాబుతో కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలవరం సాధనకు పోరాడతామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై టిటిడిపి నేతల స్పందన ఏమిటన్నారు. టెండర్లలో అవకతవకలుంటే బాబు కోర్టు కెళ్లాలన్నారు. ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాకట్టు పెడితే ఆగదన్నారు. మంత్రులు కేబినెట్ సమావేశాలకు వెళ్లి ఏం చేస్తారన్నారు. తెలంగాణను గతంలో చంద్రబాబు అడ్డుకుంటే ఇప్పుడు మంత్రులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులును తెలంగాణ చరిత్ర క్షమించదని కొప్పుల ఈశ్వర్ వేరుగా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తే తమ ప్రజల సత్తా చూపిస్తామన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చంద్రబాబు కుట్రలో భాగస్వాములు కావద్దని సూచించారు.












Click it and Unblock the Notifications