నిర్ధిష్ట కాలపరిమితి లేదు: తెలంగాణపై గులాం ఆజాద్

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి నిర్ధిష్ట కాలపరిమితి తాను చెప్పలేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ శనివారం న్యూఢిల్లీలో అన్నారు. ఉదయం ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తామన్న తమ మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. అయితే దానికి కాలపరిమితి మాత్రం చెప్పలేమన్నారు. శుక్రవారం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణ సమస్యపై పెద్దగా చర్చించలేదన్నారు.

కేవలం పార్టీ సంస్థాగత వ్యవహారాల పైనే చర్చించామన్నారు. పార్టీ వ్యవహారాల పైనే ఎక్కువగా దృష్టి సారించి చర్చించినట్లు చెప్పారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు యుపిఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు కూడా ఉండవని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా ఆదివారం రాత్రి గులాం నబీ ఆజాద్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+