వారి రాజీనామాలతో కాంగ్రెసుకు నష్టం లేదు: బొత్స

Botsa says he is in touch with resigned MLAs
మహబూబ్‌నగర్: రాజీనామాలు చేసిన ముగ్గురు శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్య టచ్‌లోనే ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనసభ్యులతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా రాజీనామాలపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. పరిస్థితిని సమీక్షించి మాట్లాడుతానని ఆయన అన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముగ్గురు శాసనసభ్యులు లేఖలను బొత్స సత్యనారాయణకు ఫాక్స్ ద్వారా పంపిన విషయం తెలిసిందే.

రాజీనామా చేసిన శాసనసభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించడానికి బొత్స సత్యనారాయణ ప్రయత్నించారు. తాను వెనక్కి వచ్చేది లేదని, ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని సోమారపు సత్యనారాయణ చెప్పారు. జూపల్లి కృష్ణారావు, రాజయ్య బొత్స సత్యనారాయణకు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ విజ్ఞప్తిని తోసిపుచ్చి తాము రాజీనామాలు చేసిన విషయాన్ని ముగ్గురు శాసనసభ్యులు కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.

ముగ్గురు శానససభ్యుల రాజీనామాలతో తమ పార్టీనికి నష్టం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. మొదటి ఆచితూచి మాట్లాడిన ఆయన ఆ తర్వాత గట్టిగానే వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు రాజీనామా చేశారని, తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+